Mangalavaram Making Video | టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajputh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’(Mangalavaram). ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్‌భూపతి (Ajay Bhupathy) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కాగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి(Ajay Bhupathi) ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ‘మంగళవారం’ మేకింగ్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘మేకింగ్ ఆఫ్ మంగళవారం’ (Making of Mangalavaram) అని విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే.. అజయ్‌భూపతి ఇదివరకెన్నడూ చేయని డిఫరెంట్ జోనర్‌ను టచ్ చేసినట్లు తెలుస్తుంది. పాయల్ కూడా తన క్యారెక్టర్‌తో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మంగళవారంలో ఏముందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాల్సిందే.
#Mangalavaaram BTS to BIG Screen 🔥
Here’s the Making videohttps://t.co/zBeeX1HYsy#MangalavaaramOnNov17th 👺
An @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🎶@starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM @saregamasouth… pic.twitter.com/7w7JMh3PxJ— BA Raju’s Team (@baraju_SuperHit) November 16, 2023