కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’.అజయ్ భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాతలు. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాట ‘గణగణ మోగాలిరా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘జాతర నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించాం. కాంతారా, విరూపాక్ష చిత్రాలకు సంగీతం అందించిన బి.అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బాణీకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, వి.ఎం.మహాలింగం ఆలపించారు’ అన్నారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ‘కంటెంట్‌తో కమర్షియల్ చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర.