హీరో మంచు మనోజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. ‘మా ఇంట చిన్నారి దేవత అడుగుపెట్టింది. ఈ పాపను మేము ప్రేమగా ‘ఎంఎం పులి’ అని పిలుస్తున్నాం.
ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని, వారు ఎల్లప్పుడూ సంతోషంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నా’ అని మంచు లక్ష్మి తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌కు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. పెద్దల అంగీకారంతో గత ఏడాది మంచు మనోజ్- మౌనికలు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో నటిస్తున్నారు.