సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ చిత్రంలో ఈ ట్విన్ సిస్టర్స్ స్నేహం నేపథ్యంలో వచ్చే ఓ పాటను ఆలపించారు.
‘ఇదే స్నేహం..’ అంటూ సాగే ఈ పాట తాలూకు వీడియోను ఆదివారం విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ గీతానికి అనూప్‌రూబెన్స్ సాహిత్యాన్నందించారు. స్నేహం గొప్పతనాన్ని తెలియజెప్పే ఈ పాటకు మంచి స్పందన లభిస్తున్నదని చిత్రబృందం పేర్కొంది.
అరియానా, వివియానాకు సంగీత ప్రపంచంలోకి స్వాగతం పలుకుతూ ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్ తదితరులు శుభాకాంక్షలందజేశారు. ‘జిన్నా’ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేను అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి మూలకథనందించారు.