Kannappa Movie | శివుడిపై బాణం గురి పెట్టిన మంచు విష్ణు.. ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ రిలీజ్
Kannappa Movie | టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.
Kannappa Movie | టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల కాళహస్తిలో జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది. ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా నుంచి మేకర్స్ ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో నాస్తికుడైన కన్నప్ప శివుడిపైకి బాణంను సంధిస్తున్నట్లు ఉంది. మరోవైపు శివుడిపై నుంచి బళ్లాలు వస్తున్నట్లు ఉన్నాయి. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. కన్నప్ప మొదట నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు. ఇక అతడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ తారలు కూడా భాగం కాబోతున్నారని సమాచారం. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మొదట నుపుర్ సనన్‌ను ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

