Ginna Movie | హార్రర్ కథతో రాబోతున్న మంచు విష్ణు.. ఆసక్తికరంగా ‘జిన్నా’ టీజర్
Ginna Movie Teaser | ఫలితం ఎలా ఉన్నా మంచు విష్ణు మాత్రం వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు. గతేడాది ‘మోసగాళ్ళు’ సినిమాతో భారీ ఫ్లాప్‌ను సాధించిన మంచు విష్ణు ఈ సారి ఎలాగైనా ‘జిన్నా’తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన జిన్నా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టెంట్ హౌజ్‌కు ఓనర్‌గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తుంటాడు అంటూ విష్ణు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏ పని చేయకుండా.. ఊరంత అప్పులు చేస్తూ గడుపుతున్నా విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది. అయితే సన్నీలియోనికు దెయ్యం పట్టినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మరి ఆ దెయ్యం వెనుక కథ ఏంటి? ఆ దెయ్యం నుండి సన్నీలియెనిను విష్ణు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. టీజర్ చూస్తుంటే చాలా కాలం తర్వాత మంచు విష్ణు హిట్టు కొట్టబోతున్నట్లు అనిపిస్తుంది.
ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటించింది. గాలి నాగేశ్వరరావు పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also:
Yashodha Movie | గర్భిణీగా సమంత.. ఉత్కంఠ భరితంగా ‘యశోద’ టీజర్..!
Suriya 42 | యుద్ధ వీరుడిగా సూర్య.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘సూర్య42’ మోషన్ పోస్టర్
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్.. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

