Manchu Manoj | ఒంటరిగా వస్తా.. కూర్చొని మాట్లాడుకుందాం : మంచు మనోజ్
Manchu Manoj – Manchu Vishnu | మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి.
Manchu Manoj – Manchu Vishnu | మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలావుంటే నిన్నటి నుంచి మంచు విష్ణు, మంచు మనోజ్‌లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు.
ఇప్పటికే విష్ణు, మనోజ్‌లు సింహం, కుక్క రిఫరెన్స్‌లు వాడగా.. ఇవి ట్విట్టర్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తాజాగా మంచు మనోజ్ పెట్టిన కూర్చొని మాట్లాడుకుందాం అనే పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#VisMith నువ్వు చాలా క్యూట్. మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు.? ఈ మీటింగ్‌కి నేను ఒంటరిగానే వస్తాను అని మాటిస్తున్న. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకురావచ్చు. లేదా మనం మంచి హెల్తీ డిబేట్ పెట్టుకుందాం. నీ #కరెంట్‌తీగ అంటూ మనోజ్ రాసుకోచ్చాడు. అయితే ఈ పోస్ట్‌కి ఎవరిని ట్యాగ్ చేయలేదు మనోజ్. కానీ ఇది విష్ణుని ఉద్దేశించి మాత్రమే మనోజ్ పెట్టినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై విష్ణు ఏం అంటాడో చూడాలి.
#VisMith u r too cute… let’s sit and talk, Man to Man. keeping women, Dad, staff and sugar out of this. What say ?!
Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I promise I will come alone, u can get whomever you want or we can have an open and healthy debate 🙌🏽❤️
Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

