NBK 111 | అఫిషీయల్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్!
Manchu Manoj | 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటుడు మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
Manchu Manoj in NBK 111 | ‘వీర సింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటుడు మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్న దర్శకుడు, మనోజ్ పోషించబోయే పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, థియేటర్లలో ఆ మ్యాజిక్‌ను ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారా అని తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో కలిసి నటించిన బాలకృష్ణ, మంచు మనోజ్ మళ్లీ కలిసి నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇందులో బాలయ్య సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ వంటి ఘనవిజయాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం ఇది కావడంతో ఈ జంట మరోసారి బాక్సాఫీస్ వద్ద మేజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
Happy Birthday dear @HeroManoj1 🤗
It’s always a delight to see your energy light up every place around you ❤️
Can’t wait to witness what’s in store with #NBK111 . pic.twitter.com/7P9mtnvDVh
— Gopichandh Malineni (@megopichand) May 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

