Manchu Manoj | బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక
Bhuma Mounika | టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన అభిమానులకు ఇటీవల శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్లడించాడు. మంచు మనోజ్, భూమా నాగ మౌనికలు ఎంతోకాలంగా స్నేహితులు.
Bhuma Mounika | టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన అభిమానులకు ఇటీవల శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్లడించాడు. మంచు మనోజ్, భూమా నాగ మౌనికలు ఎంతోకాలంగా స్నేహితులు. అయితే వీరి స్నేహం ప్రేమగా మారింది.. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో గత ఏడాది మార్చి నెలలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇక తండ్రి కాబోతున్నట్లు మనోజ్ ప్రకటించడంతో ఆయన అభిమానులు మనోజ్- మౌనిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదిలావుంటే తాజాగా భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది’ అంటూ మౌనిక రాసుకోచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మనోజ్ ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే ప్రాచెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో ఇది సిద్ధం కానుంది. దీనితోపాటు ఆయన ‘ఉస్తాద్’ అనే సెలబ్రిటీ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

