Manchu Lakshmi | అల్లు అర్జున్ ‘రాకా’లో ఊహించని ప్రపంచం.. సెట్స్‌కు వెళ్లి షాకైన మంచు లక్ష్మీ ..!
Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అట్లీ తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అట్లీ తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్, అట్లీ మేకింగ్ స్టైల్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా నటి మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతున్నాయి. ఇటీవల మంచు లక్ష్మీ ‘రాకా’ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న చిత్రీకరణను చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సినిమా కోసం సృష్టించిన ప్రపంచం, భారీ సెట్స్, విజువల్ ఎలిమెంట్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు తాను చూడని ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ చూశానని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. సినిమాలో భాగంగా కనిపించే కొన్ని జీవులు, ప్రాణుల డిజైన్లు కూడా తనను ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమె వెల్లడించారు. దీంతో ‘రాకా’ సాధారణ యాక్షన్ సినిమా కాదనే విషయం మరింత స్పష్టమవుతోందనే చర్చ మొదలైంది. ‘రాకా’ను సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సినిమాలోని ప్రపంచం ఎలా ఉండబోతుందనే ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. కొత్త తరహా విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఊహకు అందని క్రియేచర్స్తో దర్శకుడు అట్లీ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అట్లీ.. ఈసారి సైన్స్ ఫిక్షన్ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. కథతో పాటు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ను ఇప్పటివరకు చూడని విధంగా చూపించేందుకు అట్లీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బన్నీ విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. యాక్షన్, ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ సినిమాతో సొంతం చేసుకున్న క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్కేల్లో రూపొందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్, అట్లీ కలిసి ఎలాంటి విజువల్ వండర్‌ను సృష్టించబోతున్నారో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ‘రాకా’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

