సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకుడు. వి.సెల్యూలాయిడ్‌తో కలిసి ఎస్కేఎన్ నిర్మిస్తున్నాడు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది. మారుతి సినిమా అంటే ప్రేక్షకుల్లో వున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈ చిత్రం వుంటుంది. చిత్రంలో వున్న సంభాషణలు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. సంతోష్, మెహ్రీన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యువతరాన్ని ఆకట్టుకుంటాయి. నవంబరు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.