పవన్ సినిమాలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన యంగ్ బ్యూటీ

వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే సినిమా చేస్తుండగా, దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరి కొద్దిరోజులలో పవన్ తన 28వ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నాడు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
కొద్ది రోజులుగా పవన్- హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి జోరుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.చిత్రంలో పవన్ డ్యూయల్ పాత్ర పోషించనున్నాడని, ఈ చిత్రానికి సంచారి లేదా స్టేట్‌కి ఒక్కడే అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వీటిని హరీష్ శంకర్ కొట్టి పారేశారు. అలానే ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మళయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న వార్త వైరల్ కాగా, దీనిపై మానస స్పందిస్తూ.. పవన్ చేస్తున్న 28వ సినిమాలో లేనని తెలియజేస్తున్నాను, కానీ నాకు పవన్ సర్ అంటే ఇష్టం అని” క్లారిటీ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Manasa
- Pawan Kalyan
- pspk 28
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

