మంగళవారం జరిగిన జీవితమే ఒక టాస్క్‌లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్‌కి అందరి మైండ్ బ్లాక్ అయింది. ఈ టాస్క్‌ను మొత్తం మూడు భాగాలుగా విభిజించాడు. బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుంటాయి. ఈ గేమ్‌లో చివరి వరకు ఎవరు ఉంటారో వారికి ఇమ్యునిటీ లభిస్తుంది. ఆ పవర్‌తో ఒక ఇంటి సభ్యుడిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు బిగ్ బాస్.
గేమ్‌లో చిరవకు అనీ మాస్టర్ మిగలగా, ఆమెకు ఇమ్యూనిటీ లభించింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. గత వారం ఆనీ మాస్టర్‌కు వచ్చిన పవర్‌ను వాడే సమయం వచ్చిందని చెప్పాడు. ఆ పవర్‌తో ఒక ఇంటి సభ్యుడిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు. దీంతో ఆనీ మాస్టర్.. తన పవర్‌ను మానస్‌కు ఇచ్చింది.
తన కోసం లెటర్ త్యాగం చేశాడు.. డైరెక్ట్ నామినేట్ అయ్యాడు.. అందుకే మానస్‌కు ఇచ్చేస్తున్నాను అని ఆనీ చెప్పింది. దీంతో ఆనీ, మానస్ తప్పా మిగిలిన అందరూ నామినేషన్లోనే ఉన్నారు. కెప్టెన్‌గా ఉన్న షణ్ముఖ్ ఎలాగు సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఈ వారం సిరి, జెస్సీ, కాజల్, సన్నీ, విశ్వ, రవి, శ్రీరామచంద్ర, ప్రియాంకలు తొమ్మిదో వారానిగానూ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.