SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో మానస్ ఎవరు.. సస్పెన్స్ పై క్లారిటీ ఎప్పుడంటే..?
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం సైంధవ్ (SAINDHAV). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సైంధవ్ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు.
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రుహానీ శర్మ (Ruhani sharma), ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే సైంధవ్ మిషన్‌లో పాల్గొనే టీం మెంబర్స్‌ను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా సైంధవ్ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు. ఈ చిత్రంలో కీలకంగా సాగే మానస్ (Manas)పాత్ర లుక్‌ను రేపు సాయంత్రం 04:59 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి ఇందులో మానస్‌గా ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టేశారు మేకర్స్.
ఈ చిత్రంతో బీటౌన్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సైంధవ్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో కనిపించనుండగా.. రుహానీ శర్మ డాక్టర్‌గా నటిస్తోంది. సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సైంధవ్‌ను 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మానస్ ఎవరు.. ?
A Mission as Fierce as Thunder,
A Force as Resolute as Lightning! 💥Introducing MANAS from #SAINDHAV, TOMORROW @ 4:59 PM❤️🔥#SaindhavOn22ndDEC 🔥
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @vboyanapalli @maniDop…
— Niharika Entertainment (@NiharikaEnt) August 29, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

