మనం పదేళ్ల పండగ
తెలుగు సినిమా లెజెండ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా ‘మనం’. ఈ సినిమాలో కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి నటించి భౌతికంగా దూరమయ్యారు అక్కినేని.
తెలుగు సినిమా లెజెండ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా ‘మనం’. ఈ సినిమాలో కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి నటించి భౌతికంగా దూరమయ్యారు అక్కినేని. అందుకే ‘మనం’ తెలుగువారందరికీ ఓ చెరిగిపోని జ్ఞాపకం. ఓ మహానటుడి చివరి సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ అద్భుతం.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 23, 2014న విడుదలైంది. అంటే ఈ నెల 23కి సరిగ్గా పదేళ్లు అనమాట. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 23న ‘మనం’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్వారు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘నా మనసులో ‘మనం’ సినిమాది ప్రత్యేకస్థానం. పదేళ్ల వేడుక సందర్భంగా మళ్లీ ఈ చిత్రం థియేటర్లలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

