Anil Ravipudi | ‘మన శంకర వరప్రసాద్ గారు’తో సంక్రాంతికి డబుల్ బొనాంజా : అనిల్ రావిపూడి
Mana Shankara Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకంగా ఉండనుంది.
Mana Shankara Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). ఈ సినిమాను బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం అభిమానులందరినీ సర్ప్రైజ్ చేస్తుందని ఆయన అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. గత సంక్రాంతి కంటే ఈసారి మా సినిమాతో డబుల్ బొనాంజా ఉంటుంది. చిరంజీవి గారిని మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో ఈ సినిమా ఉంటుంది. ఆయన ఈ జానర్లో నటించి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తరహా ఎంటర్టైనర్తో రానున్నారు. గతంలో ఆయన ఈ జానర్లో నటించిన చిత్రాలు ఎన్ని బ్లాక్బస్టర్లు అయ్యాయో మనకు తెలిసిందే. ఈ సినిమాతో చిరంజీవి గారు అందరినీ సర్ప్రైజ్ చేయనున్నారు అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట సూపర్ హిట్గా నిలవగా, త్వరలోనే సినిమా నుండి మరో పాటను విడుదల చేయనున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రచార కార్యక్రమాలను భారీ స్థాయిలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ దశలో ఉంది. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు వెంకటేశ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

