Bramayugam Movie | పాచికలతో భయపెడుతున్న మమ్ముట్టి.. ‘భ్రమయుగం’ ట్రైలర్ రిలీజ్
Bramayugam Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు.
Bramayugam Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 15న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. హారర్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. పాచికలు గేమ్ ఆడుతూ.. ఒక పాడుబడిన ఇంట్లో బంధించబడి.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు దారి దొరక్క అల్లాడుతున్న వ్యక్తుల కథ ఈ సినిమా స్టోరి అని తెలుస్తుంది. ఇక ట్రైలర్ మొత్తం “ఇవి పావులు.. ఇవి రెండూ పాచికలు పడ్డ సంఖ్యను బట్టి పావుని జరపాలి. ముందు ఇక్కడికి చేరిన వాళ్లు గెలిచినట్లు అర్థం. దానికి భాగ్యం ఉండాలి” అనే డైలాగ్ నే మార్చి మార్చి చెప్పారు.
ఇక ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో రానుంది. అంటే ఒక్క సన్నివేశం కూడా కలర్లో ఉండదు. థియేటర్స్‌లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లోనే విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారిక ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

