Turbo | ఏడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలేమి కనిపించకుండా కుర్రహీరోలకు షాకిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో, మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ యాక్టర్లలో మరింత స్పూర్తిని నింపుతున్నాడు. ఈ స్టార్ హీరో నటిస్తున్న సినిమాల్లో ఒకటి టర్బో (Turbo).
ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ లాంఛ్ చేయగా.. మమ్ముట్టి షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఉన్న మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగీలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తూనే.. మరోవైపు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించి అభిమానులు, మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. టర్బో జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశాడు. మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
వైశాక్ ఫిల్మ్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రానికి మిధున్ మాన్యుయెల్ థామస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మమ్ముట్టి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. మమ్ము్ట్టి మరోవైపు బజూక సినిమాలో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. తమ అభిమాన హీరో నుంచి చాలా కాలానికి పక్కా మాస్ ఎంటర్టైనర్ వస్తోందని టర్బో లుక్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మమ్ముట్టి నయా లుక్..
#Turbo In Cinemas Worldwide On June 13 , 2024@TurboTheFilm @MKampanyOffl @DQsWayfarerFilm @Truthglobalofcl #TurboFromJune13 pic.twitter.com/xHoOKzW4jo
— Mammootty (@mammukka) April 14, 2024
Dropping The Much Awaited #Turbo Update on April 14 , 2024 ✨🔥@mammukka @TurboTheFilm @DQsWayfarerFilm @SamadTruth #Mammootty pic.twitter.com/jytL5XxgUL
— MammoottyKampany (@MKampanyOffl) April 10, 2024
ఊరమాస్‌గా TURBO లుక్..
Presenting the First Look Poster of @TurboTheFilm Directed by Vysakh , Written by Midhun Manuel Thomas & Produced by @MKampanyOffl #TurboFirstLook pic.twitter.com/4LeNl4KGYg
— Mammootty (@mammukka) November 26, 2023