Bramayugam | కొత్త సినిమా అనౌన్స్ చేసిన మెగాస్టార్ మమ్ముట్టి
Mammootty New Movie | మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి (Mammoty) సినిమా వస్తోందంటే చాలు.. అటు మలయాళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. ఇక యాత్ర (Yatra), ఎజెంట్ (Akhil Agent), లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ మెగాస్టార్. ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు.
Mammootty New Movie | మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి (Mammoty) సినిమా వస్తోందంటే చాలు.. అటు మలయాళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. ఇక యాత్ర (Yatra), ఎజెంట్ (Akhil Agent), నన్పాకల్ నేరతు మయక్కం (Naanpakal Nerathu Mayakkam Telugu dub) లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ మెగాస్టార్. ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు.
భూతకాలం (Bhoothakaalam 2022) ఫేమ్ రాహుల్ సదాశివన్ (Rahul SadaShivan) దర్శకత్వంలో మమ్ముట్టి తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి బ్రహ్మయుగం (Bramayugam) అనే టైటిల్ ఖరారు చేశారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాత క్లాప్ ఇచ్చి.. సినిమా ఓపెనింగ్ చేశారు. దీనితో పాటు మూవీ పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను గమనిస్తే ఒక వ్యక్తి లాంతరును పట్టుకుని పాతబడిన బంగ్లా ముందు చూస్తూ ఉన్నాడు.
#Bramayugam – My next, shoot commences today !
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @StudiosYNot pic.twitter.com/Qf9gRVwKzY— Mammootty (@mammukka) August 17, 2023
హారర్, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్‌లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ చేయనుండగా.. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించనున్నారు. ఇక పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.
#Bramayugam Pooja pic.twitter.com/98k8kaIJ5G
— Mammootty (@mammukka) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

