Mammootty | స్పీడు మీదున్న మెగాస్టార్.. హార్రర్ థ్రిల్లర్ భ్రమయుగం లుక్ వైరల్
Mammootty | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). మమ్ముట్టి ఇప్పటికే బజూక (Bazooka)లో నటిస్తున్నాడని తెలిసిందే. కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.
Mammootty | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). ఈ ఏడాది తెలుగులో ఏజెంట్ సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు మమ్ముట్టి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి ఇప్పటికే గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నబజూక (Bazooka)లో నటిస్తున్నాడని తెలిసిందే. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ సారి హార్రర్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. భ్రమయుగం (Bramayugam) టైటిల్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ నేడు షురూ అయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసి లుక్‌లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని ఉన్నాడు.
మమ్ముట్టి ఇప్పటికే మరో మూడు మలయాళ సినిమాలు కూడా చేస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. బజూక చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స్టైలిష్‌గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన లుక్‌తో తెలిసిపోతుంది.
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

