Bramayugam | మమ్ముట్టి పుట్టినరోజు.. భ్రమయుగం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి (Mammoty) నటిస్తున్న తాజా చిత్రం భ్రమయుగం (Bramayugam). భూతకాలం (Bhoothakaalam 2022) ఫేమ్ రాహుల్ సదాశివన్ (Rahul SadaShivan) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వదిలిన మేకర్స్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా నేడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
Mammootty New Movie | మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి (Mammoty) సినిమా వస్తోందంటే చాలు.. అటు మలయాళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. ఇక యాత్ర (Yatra), ఎజెంట్ (Akhil Agent), నన్పాకల్ నేరతు మయక్కం (Naanpakal Nerathu Mayakkam Telugu dub) లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ మెగాస్టార్. ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం భ్రమయుగం (Bramayugam). భూతకాలం (Bhoothakaalam 2022) ఫేమ్ రాహుల్ సదాశివన్ (Rahul SadaShivan) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వదిలిన మేకర్స్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా నేడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో మమ్ముట్టి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది.
#HappyBirthdayMammukka ! ✨
Here is the #Bramayugam Special Poster in Tamil, Telugu, Kannada & Hindi !@mammukka #Mammootty #RahulSadasivan@chakdyn @sash041075@allnightshifts @studiosynot@SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/DSQkLFbbto— Night Shift Studios LLP (@allnightshifts) September 7, 2023
హారర్, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్‌లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ చేయనుండగా.. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించనున్నారు. ఇక పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

