Mama Mascheendra Movie | ఓటీటీలోకి వచ్చేసిన మామ మశ్చీంద్రా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Mama Mascheendra Movie | సుధీర్ బాబు హిట్టు చూసి చాలా కాలం అయింది. ఆయన నటించిన కొన్ని సినిమాలైతే ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడె వెళ్తున్నాయో కూడా తెలియడం లేదు. కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించే సినిమాలు చేసినా.. ఒకానొక టైమ్‌లో అసలు సుధీర్ బాబు సినిమాలు వస్తున్న సంగతే జనాలు మర్చిపోయారు.
Mama Mascheendra Movie | సుధీర్ బాబు హిట్టు చూసి చాలా కాలం అయింది. ఆయన నటించిన కొన్ని సినిమాలైతే ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడె వెళ్తున్నాయో కూడా తెలియడం లేదు. కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించే సినిమాలు చేసినా.. ఒకానొక టైమ్‌లో అసలు సుధీర్ బాబు సినిమాలు వస్తున్న సంగతే జనాలు మర్చిపోయారు. అలాంటి టైమ్‌లో సమ్మోహనం సినిమాతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను దోచుకుందువటే, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా మంచి మంచి సినిమాలే చేశాడు. కానీ లక్ కలిసిరాకో రిలీజ్ టైం బాలేకో అన్ని తేడా కొట్టేశాయి. ఒకదానికి మించి మరొకటి అల్ల్రా డిజాస్టర్లుగా మిగులుతూ వస్తున్నాయి.
ఇటీవలే బోలెడు ఆశలు పెట్టుకున్న మామ మశ్చీంద్రా కూడా సుధీర్ బాబును ఫ్లాపుల బారీ నుంచి తప్పించలేకపోయింది. ప్రముఖ హాస్యనటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. పైగా సుధీర్ బాబు త్రిబుల్ యాక్షన్ చేయనుండటం, అందులోనూ ఒకటి లడ్డూ బాబు పాత్ర చేయడం వంటివి సినిమాపై మంచి హైప్ తెచ్చిపెట్టాయి. అయితే ఆ హైప్‌ను హర్షవర్దన్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. సినిమా ఎటునుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియని విధంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథకుడిగా, దర్శకుడిగా హర్షవర్దన్ పూర్తిగా విఫలం అయ్యాడు.
అయితే సుధీర్ బాబు మాత్రం మూడు పాత్రల కోసం తెగ కష్టపడ్డాడు. అంత కష్టపడిన చివరికి బూడిదలో వేసిన పన్నీరైంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో గతరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటించారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

