1989లో చిత్తూరుజిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. సుధీర్‌బాబు, మాళవికశర్మ జంటగా, జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర కథానాయిక మాళవికశర్మ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. చీరలో అందంగా, సాంప్రదాయబద్ధంగా కార్తికేయుని సన్నిధిలో నిలబడివున్న మాళవికశర్మ స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్.