బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ సినిమా ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో మల్లికా షెరావత్ మతులు పోగొట్టే అందాలతో కవ్వించింది. కెరీర్ ఆరంభంలోనే మల్లికా ఇంతగా అందాలు ఆరబోయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అవేమి పట్టించుకోని మల్లికా తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది. బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే నాగమతి చిత్రంలో మల్లికా కీలక పాత్ర పోషించనుందని అంటున్నారు. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.
ముంబైలో ఈ చిత్రం గ్రాండ్గా లాంచ్ కాగా, త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నటించే నటీనటులు ఎవరు, తదితర విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా, మల్లికా శెరావత్..ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. తరచూ తన ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.