malli pelli | ఆటంబాంబ్‌లా పేలుతుంది!
తొమ్మిదేండ్ల వయసులోనే ‘పండంటి కాపురం’తో బాల నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టా. 18 సంవత్సరాల వయసులో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మయ్యా. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా నా జర్నీ సాగింది.
‘పెళ్లి ఔన్నత్యాన్ని చాటుతూ ఈ సినిమా తీశాం. అన్ని వయసుల వారికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్నో సంచలన విషయాలుంటాయి’ అని చెప్పారు సీనియర్ నటుడు నరేష్. ఆయన పవిత్రాలోకేష్తో కలిసి నటించిన తాజా చిత్రం ‘మళ్లీపెళ్లి’. ఎం.ఎస్.రాజు దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం నరేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
తొమ్మిదేండ్ల వయసులోనే ‘పండంటి కాపురం’తో బాల నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టా. 18 సంవత్సరాల వయసులో ‘నాలుగు స్తంభాలాట’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మయ్యా. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా నా జర్నీ సాగింది. ఇండస్ట్రీలో యాభైఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో హీరోగా ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. పెళ్లి పవిత్రమైన బంధం. దానిని గౌరవించాలని ఈ సినిమాలో చూపించాం. ప్రమోషన్స్ కూడా కొత్తగా ప్లాన్ చేశాం. టీజర్లో చూపించిన సన్నివేశాలు మా వ్యక్తిగత జీవితంలో జరిగినవే. జిమ్మిక్కులు చేసి ప్రేక్షకుల్ని మోసం చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఈ సినిమాపై కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశాయి. పవిత్రాలోకేష్తో నేను జీవితాన్ని సాగిస్తున్నానని చెప్పాలనుకున్నా. అందుకే లిప్‌లాక్ వీడియోను విడుదల చేశాం. అది బాగా ట్రెండ్ అయింది. ఈ సినిమాలో ఎలాంటి జిమ్మిక్స్ ఉండవు. షాకింగ్ కంటెంట్‌తో ఆటంబాంబ్‌లా పేలుతుంది.
సమాజాన్ని ప్రతిబింబిస్తుంది
దర్శకుడు ఎం.ఎస్.రాజు నా దగ్గరకు వచ్చి ‘ఓ కథ చెబుతాను. అది మీతో పాటు ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు. అలా ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది. ఇందులో నిజ జీవిత సంఘటనల్ని చూపించినా..బయోపిక్ మాత్రం కాదు. ఈ సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో మదర్, ఫాదర్ పాత్రలు కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడే ఏం చెప్పను. సినిమా చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఆద్యంతం హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో సినిమా సాగుతుంది.
గొప్ప బాధ్యతగా భావించా
నటుడిగా యాభైఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నది. కెరీర్ ఆరంభంలో ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమైన నేను..ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యా. ఇప్పుడు మరలా హీరోగా నటించడం ఆనందంగా ఉంది. తెలుగులో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌ను మళ్లీ తీసుకొచ్చి వారసత్వాన్ని కాపాడటం గొప్ప బాధ్యతగా భావించాను. షూటింగ్‌కు ముందు ఈ కథాంశం మీద చాలా పరిశోధన చేశాం. నటుడిగా, నిర్మాతగా ఇదొక ప్రయోగంగా భావించా. ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

