Malli Pelli Movie | నరేష్-పవిత్ర లోకేష్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్
Malli Pelli Movie Release Date | నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మళ్ళీ పెళ్లి. ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇన్నాళ్లు నరేష్ జీవితంలో జరుగుతున్న వివాదాలనే నేపథ్యంగా తీసుకొని రూపొందించారు. రెండు వారాల క్రితం రిలీజైన టీజర్‌తోనే అది స్పష్టమైంది.
Malli Pelli Movie Release Date | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో తొలిసారి భార్య, భర్తలుగా నటించారు నరేష్, పవిత్ర. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ షికారు చేశాయి. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న ఈ ఇద్దరూ కలిసి లిప్‌కిస్ చేసుకున్న వీడియోను రిలీజ్ చేసి ఒక్క సారిగా సంచలనం అయ్యారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ముందుగా అది పబ్లిక్‌గా ఓపెన్ అయిపోయారు అని అనుకున్నారు. అయితే గతనెల పెళ్లి వీడియోను రిలీజ్ చేసి అది సినిమాకు సంబంధించిన క్లిప్స్ అని క్లారిటీ ఇచ్చేశారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లీ అనే సినిమా చేస్తున్నారు. రెండు వారాల క్రితం రిలీజైన టీజర్ పెద్ద ట్విస్టే ఇచ్చింది.
ఇన్నాళ్లు తన జీవితంలో జరుగుతున్న వివాదాలనే నరేష్ సినిమాగా చేస్తున్నట్లు టీజర్‌తో స్పష్టం చేశాడు. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు, హోటల్లో నరేష్, పవిత్రా లోకేశ్ దొరికిపోవడం వంటి సన్నివేశాలన్నిటినీ టీజర్లో చూపించారు. ఇక దాంతో నరేష్, పవిత్రల బయోపిక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను మే 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వీయి నిర్మాణంలో రూపొందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

