Malli Pelli Movie | మూడు దశాబ్దాల క్రితమే హీరో పోస్ట్‌కు ప్యాకప్ చెప్పి ఫుల్ టైమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు సీనియర్ నటుడు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఆయన కెరీర్ మాములు స్పీడ్ అందుకోలేదు. ప్రతీ ఏటా పదులకు పైగా సినిమాలు చేస్తూ యమ బిజీగా గడిపేవాడు. ఇక మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇటివలే మేయిన్ లీడ్‌లో మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ వ్యక్తిగత జీవితం, పవిత్ర లోకేష్‌తో రిలేషన్, రమ్య రఘుపతితో విడాకులు ఇలా ట్రైలర్లో ఆసక్తికర విషయాలను చెప్పి రిలీజ్ ముంగిట మంచి బజ్నే తీసుకొచ్చారు.
తొలిరోజు కాస్తో కూస్తో కలెక్షన్లు వచ్చాయింటే దానికి ఆ హైపే కారణం. అయితే ఆ డ్రామాను ఆసక్తికరంగా తీర్చి దిద్దడంలో ఎమ్.ఎమ్.రాజు విఫలం అయ్యాడు. దాంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు కష్టాలు తప్పలేదు. వందలు పెట్టి టిక్కెట్ కొని చూసే అంత సినిమా ఈ సినిమాకు లేదని ప్రేక్షకులు థియేటర్ వైపే చూడలేదు. దాంతో వారంలోపే ఈ సినిమా దుకాణం సర్దేసింది. నాలుగు వారాల్లోపే ఆహాలోకి వచ్చేసింది. మూడు రోజలు కిందట ఆహాలో వచ్చిన ఈ సినిమాను ఓటీటీ ప్రియులు తెగ ఆదరిస్తున్నారు.
థియేటర్లలో మిస్సయిన వారందరూ వెతికి మరీ ఈ సినిమాను చూస్తున్నారు. నిజంగా ట్రైలర్లో చూపించనంత మ్యాటర్ ఉందా అనే ఆసక్తితోనే సగం జనాలు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. దాంతో కుప్పలు కుప్పలుగా వ్యూస్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే వంద మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్తో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న దగ్గర్నుంచి ఆహా టాప్-10లో ట్రెండ్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు ఈ సినిమాను ఏ రేంజ్లో ఆదరిస్తున్నారో తెలిసిపోతుంది. ఎమ్.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.