మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న కొత్త సినిమా ‘మలైకొైట్టె వలిబన్’. ఈ చిత్రాన్ని జాన్ మెరీ క్రియేటివ్, సెంచురీ ఫిలింస్, మాక్స్ ల్యాబ్ పతాకాలపై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లీజో జోస్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఒక పోరాట ఘట్టంలోని కథానాయకుడి స్టిల్‌ను ఈ పోస్టర్లో చూపించారు. ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై అక్కడే కొనసాగుతున్నది. భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.