Premalu Movie | హైదరాబాద్ ‘ప్రేమలు’.. మలయాళంలో బ్లాక్ బస్టర్
Hyderabad Premalu | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం 'ప్రేమలు'(Premalu). రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 09న విడుదలై కేవలం 12 రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. తెలంగాణ(Telangana), హైదరాబాద్(Hyderabad) బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుత యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
Hyderabad backdrop | మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తాజా చిత్రం ‘ప్రేమలు'(Premalu). రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 09న విడుదలై కేవలం 12 రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. తెలంగాణ(Telangana), హైదరాబాద్(Hyderabad) బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుత యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fazil) నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం దర్శకత్వం వహించగా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా హైదరాబాద్‌లోనే జరుపుకోవడం విశేషం. కేరళ నుంచి తెలంగాణకు జాబ్ చేయడానికి వచ్చిన మలయాళీలు ఇక్కడ ఎలా ఉన్నారు అనే చిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది.
ఇక ఫన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చిన చార్మినార్, ట్యాంక్‌బండ్, తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం సీన్స్ అయితే మూవీకే హైలెట్ అని చెబుతున్నారు. మనం రోజు తిరిగే హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా అనేంతలా క్యాప్చర్ చేసి హైదరాబాదీలకు ఒక లవ్ స్టోరీ ఇచ్చాడు అని దర్శకుడికి కామెంట్లు చేస్తున్నారు. ఇక మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఎవరో ఒక నిర్మాత ఈ సినిమాను కొనుగోలు చేసి తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

