కొచ్చి: మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్(Director Ranjith)ను ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. లైంగిక దాడి కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ అరెస్టు జరిగింది. ఫిల్మ్ సెట్లోనే డైరెక్టర్ రంజిత్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇడుక్కి జిల్లాలో రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్ షూటింగ్ సమయంలో తనను కారవాన్‌కు రావాలని డైరెక్టర్ పిలిచారని, ఆ సమయంలో అతను లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నది. కొచ్చి సిటీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తోడుపుజాలో ఉన్న పోలీసు స్టేషన్లో ఆ డైరెక్టర్ ఉన్నారు. మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదును మహిళా పోలీసు స్టేషన్లో రికార్డు చేశారు.
కేసును నమోదు చేసిన తర్వాత చాలా రహస్యంగా రంజిత్‌ను అరెస్టు చేశారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల జస్టిస్ కే హేమా కమిటీ ఓ నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ రిపోర్టులో రంజిత్ పేరు కూడా ఉన్నది. 2024లో రంజిత్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు అయ్యింది. బెంగాలీ నటి ఆ ఫిర్యాదు చేసింది. కొచ్చి సిటీ పోలీసు కమీషనర్ వద్ద ఆ ఫిర్యాదు నమోదు చేశారు. 2009లో పాలేరి మాణిక్యం చిత్రంలో నటించేందుకు తనను రమ్మన్నాడని, ఆ తర్వాత తనను డైరెక్టర్ రంజిత్ కామవాంఛతో టచ్ చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది.