Vaazha 2 | తెలుగులోకి మలయాళం బ్లాక్ బస్టర్.. ‘వాలా 2’ ట్రైలర్ చూశారా!
Vaazha 2 | మలయాళ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బ్లాక్ బస్టర్ మూవీ 'వాలా 2' (Vaazha 2) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
Vaazha 2 | మలయాళ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వాలా 2’ (Vaazha 2) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం నవ్వులే కాదు, యువత ఆలోచనలను ప్రతిబింబించే చిత్రమని అర్థమవుతోంది. చదువులో వెనుకబడి, ఇంట్లో తిట్లు తింటూ, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడే నలుగురు సామాన్య కుర్రాళ్ల కథే ఈ ‘వాలా 2’. కామెడీ, ఎమోషన్స్ మరియు స్నేహం కలగలిసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మలయాళంలో ఈ చిత్రం ఇప్పటికే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, గత రికార్డులను తిరగరాసింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించగా, సావిన్ SA దర్శకత్వం వహించారు. ఈ వేసవి సందడిని రెట్టింపు చేస్తూ ఏప్రిల్ 24, 2026న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

