అధికారుల తప్పిదం.. మార్క్ షీట్లో అనుపమ ఫోటో

కొందరు అధికారుల తప్పిదాల వలన విద్యార్ధులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీహర్‌లో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు సాక్ష్యం. గతంలో ఓ విద్యార్థి దరఖాస్తు ఫారంలో.. తండ్రి పేరు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిగా పడింది. తల్లి పేరు సన్నీ లియోన్‌గా పేర్కొన్నారు. ఇక అడ్రెస్‌ను ముంబై రెడ్ ఏరియాగా ముద్రించారు. అంతకుముందు జూనియర్ ఇంజనీర్ పరీక్షల్లో సన్నీ లియోన్‌ను టాపర్‌గా ప్రకటించారు.
ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ అధికారులలో మార్పు రావడం లేదు. బీహార్‌కు చెందిన రిషికేశ్ అనే యువకుడు ఇటీవలస్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే వచ్చాయి. మ్యాథ్స్ పేపర్ 1లో 150 కి 77.70, మ్యాథ్స్ పేపర్ 2లో 150కి 95.45 మార్కులు వచ్చాయి. కాని మార్క్ షీట్లో మాత్రం అతని ఫొటోకి బదులు వేరే వారి ఫొటో ప్రత్యక్షం అయింది. ఆ ఫొటో మరెవరిదో కాదు మలయాళ నటి అనుపమది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదట. అయితే మెమో వైరల్ కావడంతో బీహార్ విద్యాశాఖ తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఈ తప్పిదంపై దర్యాప్తునకు ఆదేశించామని బీహార్ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

