మోహన్ లాల్ సంచలన నిర్ణయానికి మలయాళ ఇండస్ట్రీ షాక్..

Bro daddy movie in OTT | మలయాళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో మోహన్ లాల్. రెండేండ్ల కింద వరకు కేరళ ఇండస్ట్రీ అంటే అందరికీ చిన్నచూపు ఉండేది. అక్కడ మార్కెట్ మహా అయితే 40 కోట్లు దాటదు అంటూ తక్కువగా చూసే వాళ్లు. అలాంటిది ఒకే ఒక హీరో మలయాళ ఇండస్ట్రీ మార్కెట్ పెంచేశాడు. తన భుజస్కంధాలపై ఇండస్ట్రీ భారం మొత్తం మోశాడు. రూ.40 కోట్లు కాదు 100 కోట్లు వసూలు చేసే సత్తా మలయాళ సినిమాలకు ఉంది అని నిరూపించాడు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అతడే మోహన్ లాల్. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాల సంచలన విజయం అందుకుంటున్నాయి.
మార్కెట్ పరంగా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి. మన్యం పులి, దృశ్యం, లూసిఫర్ లాంటి సినిమాలు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేశాయి. అలాంటి హీరో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా తన సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. ఏదో ఒక సినిమా అలా చేస్తే పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు.. కానీ ఆయన ప్రతి సినిమా నేరుగా డిజిటల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీని కోసం వందల కోట్ల డీల్ మాట్లాడుకుంటున్నాడు మోహన్ లాల్. ఇప్పటికే 2021లో ఈయన నటించిన దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై సంచలన విజయం అందుకుంది.
#BroDaddy 😊 streaming from January 26 on @DisneyPlusHS@Mohanlal @PrithviOfficial @antonypbvr @aashirvadcine @DisneyPlusHS @PrithvirajProd #BroDaddyFromJan26 pic.twitter.com/HF1xtMrxOM
— Bro Daddy (@BroDaddyMovie) January 20, 2022
భారీ బడ్జెట్ తో ప్రియదర్శన్ తెరకెక్కించిన మరక్కార్ కూడా కేవలం రెండు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇక ఇప్పుడు ఆయన నటించిన బ్రో డాడీ సినిమా జనవరి 26న నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. రెండేళ్ల కింద ఈ కాంబినేషన్లో వచ్చిన లూసిఫర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్లో బ్రో డాడీ తెరకెక్కించారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో జనవరి 26న నేరుగా డిజిటల్ మీడియాలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దీనిపై కేరళలో థియేటర్స్ సంఘం కోపంగా ఉన్నారు. పరిస్థితులు బాగాలేవని స్టార్ హీరోల ఇలా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్స్ భవిష్యత్తు ఏమైపోతుంది అంటూ వాళ్లు వాపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
రంగంలోకి దిగిన రజినీ, కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలవబోతున్నారా!
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

