Gopichand Next Movie | గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు సరైన హిట్టే లేదు. మధ్యలో ‘గౌతమ్ నందా’, ‘సీటీమార్’ సినిమాలు మంచి టాకే తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. భారీ అంచనాలతో ఇటీవలే విడుదలైన ‘రామబాణం’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. తన కెరీర్లో రెండు భారీ విజయాలిచ్చిన శ్రీవాస్ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. ప్రస్తుతం గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా గోపి తన తదుపరి సినిమాను ఏ. హర్ష దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటకే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి.
రేపో, మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే ఈసినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా మాళవికా శర్మ నటించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈమె తెలుగులో నేలటిక్కెట్, రెడ్ వంటి సినిమాలు చేసింది. అయితే ఇవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపులుగా మిగలడంతో టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు రాలేవు. ఇక ఇటీవలే సల్లూభాయి నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో కీలకపాత్ర పోషించింది.
ఇక ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. గోపిచంద్ పోలీస్ క్యారెక్టర్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. దాంతో తనకు అచ్చొచ్చిన పోలీస్ క్యారెక్టర్‌ను ఈసారి నమ్ముకున్నట్లు సమాచారం. ఇక చివరగా గోపిచంద్ ‘గోలిమార్’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఈ లెక్కన మళ్లీ పుష్కర కాలం తర్వాత ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడన్న మాట.