Malaikottai Vaaliban | ఓటీటీలోకి మోహన్‌లాల్ ‘మలైకోటై వాలిబన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Malaikottai Vaaliban | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) నటించిన తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
Malaikottai Vaaliban | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) నటించిన తాజా చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. కథ, కథనం ఏవి కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో వారం లోపే దుకాణం సర్దేసింది. సుమారుగా రూ.67 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో కేవలం రూ.6.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మోహన్ లాల్ కెరీర్ లోనే కాదు… మలయాళ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా మలైకోటై వాలిబన్ నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ చిత్రం ఫిబ్రవరి 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హరీష్ పేరడి ఈ చిత్రంలో కీ రోల్ పోషించగా.. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్, మనికంద రాజన్, ఆండ్రియా రావెరా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కించారు.
Lijo Jose Pellissery’s #MalaikottaiVaaliban digital arrives February 23 on Disney+ Hotstar.
Starring – Mohanlal, Sonalee Kulkarni, Katha Nandi, Rajeev Pillai & Hareesh Peradi.#MalaikottaiVaalibanOnHotstar pic.twitter.com/cI3FTGIUnH
— Ott Updates (@Ott_updates) February 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

