ముంబై: బాలీవుడ్ నటి మలైకా అరోరా.. హాట్ లుక్స్‌తోనే కాదు, అప్పుడప్పుడు శారీ లుక్‌లోనూ అదరగొడుతుంది. పండుగ సీజన్ వేళ.. మోడల్ మలైకా ఈసారి చీర కట్టులో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలను అప్డేట్ చేసింది. ఇక ఆ ఫోటోలకు తెగ లైక్‌లు వచ్చిపడుతున్నాయి. గ్రీన్ రంగు చీరలో మలైకా ఓ మెరుపులా మెరుస్తోంది. ఎమరాల్డ్ గ్రీన్ ధగధగల్లో అరోరా బ్యూటిఫుల్‌గా దర్శనమిస్తోంది. మనీష్ మల్హోత్రా ఈ శారీని డిజైన్ చేశారు. ఆకుపచ్చ టచ్‌లో మెరిసిపోతున్న ఈ చీర ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే. డిజైనర్ మనీశ్.. ఈ శారీ ధరను 1.35 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఖరీదు ఎక్కువే అయినా.. మలైకా మాత్రం ఆ చీరలో ఆకట్టుకుంటోంది.