Rajinikanth | మరో ఆట మొదలైంది.. జైలర్ తర్వాత దూకుడు పెంచిన రజినీ
‘జైలర్'కి ముందు కొన్నేళ్లుగా తలైవాకు సరైన విజయం లేదు. ఆయన పని అయిపోయిందనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే, సూపర్‌స్టార్‌కి హిట్ వస్తే, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ‘జైలర్' రుచిచూపించింది.
Rajinikanth | ‘జైలర్’కి ముందు కొన్నేళ్లుగా తలైవాకు సరైన విజయం లేదు. ఆయన పని అయిపోయిందనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే, సూపర్‌స్టార్‌కి హిట్ వస్తే, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ‘జైలర్’ రుచిచూపించింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానుల ఆకలి తీర్చేసింది ‘జైలర్’. ప్రస్తుతం తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాల్‌సలామ్’ చిత్రంలో రజనీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదిలావుంటే.. ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు తలైవా. ఇది ఆయన 170వ చిత్రం. ‘
వేటైయాన్’ అనే పేరును ఈ సినిమాకు ఖరారు చేశారు. మంగళవారం రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ని కూడా చిత్రబృందం రివీల్ చేశారు. ఇక గ్లింప్స్‌లో రజనీకాంత్ తనదైన ైస్టెల్లో లాఠీ పట్టుకుని నడుచుకుంటూ రావడం, ైస్టెలిష్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం.. అనంతరం ‘ఆట మొదలైంది’ అని డైలాగ్ చెప్పడంతో ఈ గ్లింప్ పూర్తయింది. దీన్ని బట్టి ఈ సినిమాలో తలైవా పోలీస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తున్నది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

