Major Fisrt Day Collections | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన అభిమానాన్ని ఏర్పరచుకున్న నటుడు అడివి శేష్. టాలీవుడ్లో థ్రిల్లర్ కథలకు కెరాఫ్ అడ్రెస్‌గా శేష్ నిలిచాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం అతిశయోక్తి కాదు. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. శేష్ గత చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్లకు ఐదు రేట్లు అధికంగా ఈ చిత్రానికి వచ్చాయి. ఈ చిత్ర ఏరియా వైజ్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే
నైజాం : 1.69 కోట్లు
సీడెడ్ : 0.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.50 కోట్లు
ఈస్ట్ : 0.34 కోట్లు
వెస్ట్ : 0.24 కోట్లు
గుంటూరు : 0.29 కోట్లు
కృష్ణా : 0.28 కోట్లు
నెల్లూరు : 0.19 కోట్లు
ఏపీ+తెలంగాణ : 3.98 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.70 కోట్లు
ఓవర్సీస్ : 2.35 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) : 7.03 కోట్లు
‘మేజర్’ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కావాలంటే రూ.15 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం మొదటి రోజు రూ.7.03 కోట్ల షేర్ రూ.13.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీకెండ్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుంది.