BRO Daddy Remake | బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయని సమాచారం. కాగా ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ (BRO Daddy)కి రీమేక్‌గా రానుంది. మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్లో మార్పులు చేశాడట డైరెక్టర్. ఒరిజినల్ వెర్షన్లో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకులుగా నటించారు. అయితే తెలుగు వెర్షన్లో మాత్రం తండ్రీకొడుకుల థీమ్‌ను కాకుండా సోదరుల కథ నేపథ్యంలో పాత్రలను డిజైన్ చేశారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు యువ హీరో శర్వానంద్ (Sharwanand) మరో లీడ్ రోల్లో కనిపించబోతున్నాడన్న వార్త జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై చిరు టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీలీల వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవనున్నట్టు టాక్.
రీమేక్ రైట్స్ ను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ కొనుగోలు చేయగా.. హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా ఉండనుంది. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ డైరెక్షన్లో భోళాశంకర్‌లో నటిస్తున్నాడు. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. లూసిఫర్ రీమేక్‌గా నటించిన గాడ్‌ఫాదర్ మంచి తెచ్చుకుంది. మరోవైపు వేదాళమ్ రీమేక్ కూడా త్వరలో రాబోతుంది. ఇప్పుడు బ్రో డాడీ రీమేక్‌తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడన్నది తెలియాల్సి ఉంది.