Maidaan Movie | ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవగణ్ ‘మైదాన్’.. కానీ!
Maidaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మైదాన్ (Maidaan Movie). ఇండియన్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించాడు.. జీ స్టూడియోస్ సంస్థ, బోనికపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Maidaan Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మైదాన్ (Maidaan Movie). ఇండియన్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించాడు.. జీ స్టూడియోస్ సంస్థ, బోనికపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ.. ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. రూ.349కి ఈ సినిమాను ప్రైమ్ అందుబాటులో ఉంచింది.
1950-62 మధ్యకాలంలో ఫుట్‌బాల్ ఆటకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఫుట్‌బాల్ ఆటకు ఇంత ఆదరణ రావడానికి కారణం ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్(Abdul Raheem). అబ్దుల్ రహీమ్ కోచ్‌గా ఉన్నప్పుడే 1951, 1962లో భారత ఫుట్ బాల్ టీమ్ ఆసియా గేమ్స్ లో విజయం సాధించింది. ఇక అబ్దుల్ రహీమ్ కోచ్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాగా.. అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగణ్ నటించగా.. అతడి భార్య పాత్రలో ప్రియమణి నటించింది. ఇక ఈ సినిమాలో గజ్రాజ్ రావ్. రుద్రానిల్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.
#Maidaan is available to Rent on AMAZON PRIME. pic.twitter.com/hEhcFqoZzE
— Christopher Kanagaraj (@Chrissuccess) May 22, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

