Mahi V Raghav | ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమంటే అంత సులభం కాదు. అలాంటి టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ (Mahi V Raghav). ఈ ఏడాది యాత్ర 2తో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. ‘సైతాన్’ కాగా ప్రదీప్ అద్వైతం రచనలో ఈ దర్శకుడి కాంపౌండ్ నుంచి సేవ్ ది టైగర్స్ (సీజన్ 1) వచ్చిందని తెలిసిందే. ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీజన్ 1కు మంచి స్పందన వచ్చింది. ఇక రీసెంట్గా విడుదలైన సేవ్ ది టైగర్స్ సీజన్ 2 తొలి వారంలోనే మంచి వ్యూయర్ షిప్ సాధించింది.
ఈ నేపథ్యంలో మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాడు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, కపుల్స్ మధ్య సాగే సంభాషణలతోపాటు బలమైన భావోద్వేగాలను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించడంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. అలా చేయడం వల్లే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నాడు.
సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని చూపిస్తే.. సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను తెలియజేసే ప్రయత్నం చేశాం. సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్టవడంతో సీజన్ 2 విషయంలో ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చూపించాలనుకున్నప్పుడు సెటైరికల్ రైటింగ్ చాలా అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తూ.. సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను అందించేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్ కామెంట్స్ తో మహి వి రాఘవ్
రానున్న రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్‌లు రావడం ఖాయమైనట్టే.