Sarkaru Vaata Paata | ‘సర్కారువారి పాట’ మరో రికార్డు.. మొదటి స్థానంలో మహేష్‌బాబు!
Sarkaru Vaata Paata | దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్‌ను పెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. భారీ అంచనాలతో మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సర్కారు వారి పాట చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. లేటెస్ట్‌గానే ఈ చిత్రం అమెరికాలో 2మిలియన్ గ్రాస్‌ను క్రాస్ చేసి 2.5 మిలియన్‌కు దగ్గర్లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
‘సర్కారువారి పాట’ చిత్రం టాలీవుడ్లో బెంచ్ మార్కును సెట్ చేసింది. రీజినల్ చిత్రాలలో వేగంగా రూ.200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సినిమాగా సర్కారు వారి పాట రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను సాధించడమంటే విశేషం అనే చెప్పాలి. ఇదే జోరు కొనసాగిస్తే మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించి లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Super 🌟 @urstrulyMahesh's SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

