ఆంగ్ల చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటుడు మహేశ్ శ్రీరామ్ ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘ఫణి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఓఎంజీ ప్రొడక్షన్స్ పతాకంపై, ఏయు అండ్ ఐ స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ కథానాయికగా నటిస్తున్నది. త్వరలోనే హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇతర ప్రపంచ భాషల్లో ‘ఫణి’ విడుదల కానున్నది.
మరోవైపు మహేశ్ శ్రీరామ్ హాలీవుడ్లో నటించిన ‘కౌబాయ్ అండ్ ఇండియన్’ సినిమా శనివారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ నాప్ పోషించిన స్టీవ్ పాత్రకు స్నేహితుడైన విజయ్ పాత్రలో మహేశ్ శ్రీరామ్ కనిపించనున్నారు. స్నేహితుడికి అండగా నిలిచే ఈ పాత్రలో మహేశ్ శ్రీరామ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. లియో పి షెల్లీ ఈ చిత్రానికి దర్శకుడు.