ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మొదలు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. హీరోగా ఈయన మొదటి సినిమా రాజ కుమారుడు 1999 లో విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ కు కావాల్సిన పునాది గట్టిగా వేసింది రాజ కుమారుడు. ఇదిలా ఉంటే ఈ 22 సంవత్సరాలలో 26 సినిమాలు పూర్తి చేశాడు మహేష్ బాబు. ఇన్నేళ్లలో మహేష్ నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషలలోకి రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా సంచలన విజయం సాధించాయి. ఒక్కడు, పోకిరి ఇలాంటి సినిమాలు ఇతర ఇండస్ట్రీలలో రికార్డులు తిరగరాశాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సారి కూడా రీమేక్ సినిమాలో నటించలేదు.
అసలు ఆయన అటువైపు కూడా చూడలేదు. ఇంకో భాషలో హిట్ అయిన సినిమా తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు మహేష్ బాబు. చాలామంది దర్శక నిర్మాతలు మహేష్ తో రీమేక్ సినిమాలు చేయాలని ప్రయత్నించారు.. కానీ వాళ్లకు మాత్రం ఆయన చాలా సున్నితంగా నో చెప్పాడు. తనకు రీమేక్స్ చేయడం ఇష్టం ఉండదు అని ఓపెన్ గానే చెప్పాడు సూపర్ స్టార్. ఆల్రెడీ ఒకరు చేసిన సినిమా మళ్లీ తాను చేయడం అనేది తనకు నచ్చని పని అని.. ఎంత ప్రయత్నించినా కూడా ఆ కథలో తనను తను చూసుకోలేను.. ఒరిజినల్ లో నటించిన హీరోనే కనిపిస్తాడు అంటున్నాడు మహేష్ బాబు.
అందుకే రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. అప్పట్లో 3 ఇడియట్ సినిమా తెలుగులో మహేష్ బాబు.. తమిళంలో విజయ్ హీరోగా శంకర్ రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ దీనికి నిర్ధాక్షణ్యంగా నో చెప్పాడు మహేష్. అంతెందుకు కృష్ణ పాత సినిమాలు కొన్ని మహేష్ తో రీమేక్ చేస్తే బాగుంటాయని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ తాను రీమేక్ సినిమాలు చేయను అని తేల్చేశాడు మహేష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Mahesh babu
- remake
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

