ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణను తలచుకుంటూ అగ్రహీరో మహేష్‌బాబు ట్విట్టర్లో భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. తన తండ్రి చివరి శ్వాస వరకు నిర్భయంగా, ధైర్యం, సాహసం కలబోసిన వ్యక్తిత్వంతో జీవితాన్ని సాగించారన్నారు. ‘మీరు జీవితాన్ని ఓ ఉత్సవంలా గడిపారు. అంతే గొప్పగా నిష్క్రమించారు. నా ధైర్యం, స్ఫూర్తి మీరే. నేను మీలో చూసిన ఉన్నతమైన గుణాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. కానీ ఆలోచిస్తే గతంలో కంటే ఇప్పుడే నేను మరింత దృఢసంకల్పంతో ఉన్నాననిపిస్తున్నది. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు. మీ తేజస్సు నాలో ప్రకాశిస్తుందన్న నమ్మకం ఉంది. మీ వారసత్వాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. మీరే నా సూపర్‌స్టార్’ అంటూ మహేష్‌బాబు ట్వీట్ చేశారు.