అభిమానులతో టైటిల్ రిలీజ్
మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న దివంగత సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు.
మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న దివంగత సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. అభిమానుల చేతుల మీదుగా థియేటర్లలో టైటిల్ ఆవిష్కరణ ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు, అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.
అయితే మరికొద్ది రోజుల్లో టైటిల్ సస్పెన్స్ వీడనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్‌బాబు కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు చక్కటి విజయాలు సాధించడంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

