Mahesh babu | అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో మహేష్‌బాబు.. ఫోటోలు వైరల్
Mahesh babu latest Photos | ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోలలో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు.
Mahesh babu latest Photos | ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోలలో హ్యాండ్సమ్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు. అందరికీ వయసు మీదపడుతుంటే మహేష్‌కు మాత్రం తగ్గుతుందంటూ తరచూ కామెంట్స్‌ను చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఆ కామెంట్స్ నిజమే అనిపిస్తున్నాయి. ప్రముఖ క్లాత్ బ్రాండ్ ఓట్టో కోసం మహేష్ ఇటీవల ప్రమోషన్లో భాగంగా ఫోటో షూట్లో పాల్గొన్నాడు. పలు షర్ట్స్‌లో కెమెరాకు స్టిల్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతాన్నాయి. దీనిపై పలువురు నెటీజన్లు మహేష్ అన్నం తింటున్నాడా? అందం తింటున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘సర్కారు వారి పాట’తో యావరేజ్ హిట్‌ను అందుకున్న మహేష్.. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత మళ్లీ మహేష్ నుంచి యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్‌ను చూడబోతున్నట్లు పోస్టర్‌తోనే స్పష్టం అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌కు జోడీగా శ్రీలీల, పూజాహెగ్డేలు నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వేంచర్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనుంది. ఈ సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టే యువకుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్తో రాజమౌళికి తిరుగులేని పాపులారిటీ వచ్చింది. దాంతో మహేష్‌తో చేయబోయే సినిమాను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు.
Life in luxury! #Otto pic.twitter.com/aSiJUTWVTT
— Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

