సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ (Biopics) ట్రెండ్ కొత్తేమీ కాదు..సినిమా, క్రీడా రంగాలతోపాటు ఇతర రంగాల్లో ప్రముఖులుగా వెలుగొందిన వ్యక్తుల జీవితాలు ఇప్పటికే చాలా తెరపైకి వచ్చాయి. మిగతా సినిమాల మాటెలా ఉన్నా..బయోపిక్స్ కు మాత్రం బాక్సాపీస్ వద్ద స్పందన బాగుంటుంది. ఇప్పటికే వెండితెరపై నందమూరి తారకరామారావు బయోపిక్ సందడి కూడా చేసింది. ఆయన కుమారుడు బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించి..అందిరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. మరోవైపు అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ అంశం కూడా పలు సార్లు తెరపైకి వచ్చింది.
ఈ అలనాటి హీరోల తరం నాటి మరో లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna). తెలుగు సినీ పరిశ్రమకు కౌబాయ్ సినిమాను పరిచయం చేయడమే కాదు..హీరోగా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు కృష్ణ. ఈ అలనాటి స్టార్ హీరో జీవితం కూడా తెరపైకి ఎప్పుడొస్తుందా..? అని సూపర్ స్టార్ అభిమానులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఇదే విషయంపై మహేశ్ బాబు (Mahesh Babu) మేజర్ సినిమా ట్రైలర్ (Major Trailer launch event) లాంఛింగ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. మీ తండ్రి కృష్ణ బయోపిక్ ఎప్పుడొస్తుందో చెప్తారా..? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే…ఫస్ట్ నేనే చాలా ఆనందంగా చూస్తా..నేనైతే యాక్టింగ్ చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా డైరెక్ట్ చేస్తానంటే నేనే నిర్మిస్తానని క్లారిటీ ఇచ్చాడు మహేశ్‌బాబు.
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్