Maharaja Movie | మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన సహజ నటనతో టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు లేటెస్ట్గా జవాన్ సినిమాతో బాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. హీరోగా, విలన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి మహారాజా (Maharaja) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. పోస్టు ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
మహారాజా ఫస్ట్ లుక్ (Maharaja First Look)ను సెప్టెంబర్ 10 (ఆదివారం) విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ సినిమాకు ‘ఒంబత్తనే దిక్కు’, ‘కురంగు బొమ్మైస’ చిత్రాల ఫేమ్ నితిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్, అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
#MaharajaFirstLook is releasing on Sep 10th. #Maharaja @Dir_nithilan @PassionStudios_ @TheRoute @Jagadishbliss @Sudhans2017 @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @ThinkStudiosInd @jungleeMusicSTH #VJS50FirstLook #VJS50 #PassionAndRoute pic.twitter.com/W3pSARFR8O
— VijaySethupathi (@VijaySethuOffl) September 8, 2023