ఆకట్టుకుంటున్న ‘మహాన్’ ట్రైలర్..ఓటీటీ విడుదల ఎప్పుడంటే..?
Mahaan movie | విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన సినిమాలకు తెలుగులోనూ మంచి కలెక్షన్లు వస్తుంటాయి. గత కొంత కాలం నుండి ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేక పోతున్నాయి. ఈ క్రమంలో విక్రమ్ కొడుకుతో కలిసి మహన్ చిత్రంలో నటిస్తున్నాడు. పేట, జగమేతందిరమ్ ఫేం కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారి అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి10 న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ క్రమంలోనే మహాన్ చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

స్కూల్లో పిల్లల అల్లరిని భరించే కామర్స్ టీచర్ గాంధీ మహాన్ గా ట్రైలర్ ప్రారంభమవగా జీతంలో 50రూపాయలు తగ్గాయని మహాన్ ను తిట్టే భార్యగా సిమ్రాన్ పాత్ర ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే తన తండ్రి లక్ష్యమైన మధ్యపాన నిషేదం కోసం పోరాడతానని విక్రమ్ చిన్నతనంలోనే మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ మధ్యపాన నిషేధ పోరాటవీరుడి కొడుకు ఊరంతా సారా కాచి పోస్తున్నాడు అంటూ దృవ్ విక్రమ్‌ను ట్రైలర్లో పరిచయం చేశారు. ఏపి మందు సామ్రాజ్యానికి మహారాజు నా బాబు అంటూ దృవ్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అరేయ్ నా కొడకా ఇప్పుడు నీ బాబు అప్పుడు నువ్ చూసిన గాంధీ మహాన్ అని పేరుపెట్టుకున్న కామర్స్ టీచర్ కాదు అంటూ విక్రమ్ ,దృవ్ మధ్య వచ్చే డైలాగ్స్ అలరిస్తున్నాయి.
కార్తిక్ సుబ్బరాజు తన మార్క్ యాక్షన్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. నిజ జీవిత తండ్రి కొడుకులైన విక్రమ్ , దృవ్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించడంతో ప్రేక్షకులులో ఈ చిత్రం పై మరింత అంచనాలు పెరిగాయి. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రంలో బాబీ సింహా, సిమ్రాన్, ముత్తుకుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించనుండగా సినిమాటోగ్రఫి శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్ వివేక్ హర్షన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

